జీతాలు అడిగితే గేటు వద్దే ఆపేస్తారా.. ఐఐటీ హైదరాబాద్ హౌస్ కీపింగ్ ఉద్యోగుల ఆందోళన
సంగారెడ్డి, 10 నవంబర్ (హి.స.) ప్రతి నెల పదో తారీకు వరకు కూడా తమకు జీతాలు రావడం లేదని, ఇదేమిటి అని అడిగితే గేటు వద్దే తమను విధుల్లోకి రాకుండా ఆపేసారంటూ సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్లో పనిచేసే హౌస్ కీపింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్న
ఐఐటీ హైదరాబాద్


సంగారెడ్డి, 10 నవంబర్ (హి.స.)

ప్రతి నెల పదో తారీకు వరకు కూడా

తమకు జీతాలు రావడం లేదని, ఇదేమిటి అని అడిగితే గేటు వద్దే తమను విధుల్లోకి రాకుండా ఆపేసారంటూ సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్లో పనిచేసే హౌస్ కీపింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం అక్కడ పనిచేసే వారంతా సదరు కాంట్రాక్టర్ను ఇదే విషయమై ప్రతి నెల 10వ తారీఖు వరకు కూడా సరిగ్గా జీతాలు అందడం లేదని, అలాగే విధుల్లో తమకు సరైన డ్రెస్సులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రశ్నించారు. దీంతో అక్కడికి వచ్చిన వారిని అందరినీ గేటు వద్దే ఆపేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు సరైన న్యాయం చేయాలంటూ ఐఐటీ హైదరాబాద్ గేటు ఎదురుగా వారంతా డిమాండ్ చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande