బీజేపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన జమ్మూకశ్మీర్ సీఎం
జమ్ము కాశ్మీర్, 10 నవంబర్ (హి.స. బీజేపీ ఎమ్మెల్యే సునీల్ శర్మ చేసిన వ్యాఖ్యలను జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. 20235 కేంద్రంలో పార్టీతో పొత్తుపెట్టుకుని జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ఒమర్ అబ్దుల్లా కోరారని సునీల్ శర్మ శ
జమ్మూ కాశ్మీర్


జమ్ము కాశ్మీర్, 10 నవంబర్ (హి.స. బీజేపీ ఎమ్మెల్యే సునీల్ శర్మ చేసిన

వ్యాఖ్యలను జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. 20235 కేంద్రంలో పార్టీతో పొత్తుపెట్టుకుని జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ఒమర్ అబ్దుల్లా కోరారని సునీల్ శర్మ శనివారం ఆరోపించారు. ఖురాన్ పై ప్రమాణం చేసి చెప్పు నువ్వు బీజేపీతో పొత్తు కోసం రాలేదా? అంటూ ప్రశ్నించారు.

దీంతో సునీల్ శర్మ వ్యాఖ్యలు జమ్మూకశ్మీర్ లో హాట్ టాపిక్ గా మారాయి. కాగా ఈ వ్యాఖ్యలపై ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేధికగా స్పందించారు. రాష్ట్ర హోదా కోసం కానీ మరే ఇతర కారణంచేతగానీ తాను 2024లో బీజేపీతో పొత్తు కోరుకోలేదని స్పష్టం చేశారు. పవిత్ర ఖురాన్ పై ప్రమాణం చేస్తున్నానని అన్నారు. సునీల్ శర్మలాగా తాను జీవనోపాధి కోసం అబద్ధాలు చెప్పను అంటూ కౌంటర్ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande