పరిగి ఆర్టీసీ డిపోలో విషాదం.. బస్సు ఢీకొని మెకానిక్ మృతి..
వికారాబాద్, 10 నవంబర్ (హి.స.) వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్సు డిపోలో బస్సు ఢీకొని మెకానిక్ మృతి చెందాడు. ఆర్టీసీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్కు చెందిన ఖుద్దూస్(59) పరిగి ఆర్టీసీ డిపోలో మూడేళ్లుగా డిప్యూటీ ఆఫ్ మెకానిక్గా సూపరిం
మెకానిక్ మృతి..


వికారాబాద్, 10 నవంబర్ (హి.స.)

వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్సు

డిపోలో బస్సు ఢీకొని మెకానిక్ మృతి చెందాడు. ఆర్టీసీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్కు చెందిన ఖుద్దూస్(59) పరిగి ఆర్టీసీ డిపోలో మూడేళ్లుగా డిప్యూటీ ఆఫ్ మెకానిక్గా సూపరిండెంట్ పనిచేస్తున్నాడు. పరిగి ఆర్టీసీ డిపోలో నుంచి బస్సు ఔటింగ్ ( బస్టాండుకు) డ్రైవర్ ఎం. వెంకటయ్య తీసుకు వస్తున్నాడు. ఆర్టీసీ డిపోలో గేటు దాటి హైవే రోడ్డు పైకి సగభాగం బస్సు వెళ్ళింది. బ్రేక్ పడకపోవడంతో బస్సు హైవే రోడ్డు నుంచి తిరిగి డిపోలోకి రివర్స్ వచ్చింది. దీంతో వెనకాల నిల్చున్న ఖుద్దూస్ పైకి బస్సు ఎక్కి వెళ్ళింది. ఈ ఘటనలో ఖుద్దూస్కి తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande