సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఇల్లందు డీఎస్పీ ఎన్.చంద్రబాను
భద్రాద్రి కొత్తగూడెం , 10 నవంబర్ (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు చైతన్యం- డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా టేకులపల్లి స్టేషన్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. టేకులపల్లి
ఇల్లందు డీఎస్పీ


భద్రాద్రి కొత్తగూడెం , 10 నవంబర్ (హి.స.)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు చైతన్యం- డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా టేకులపల్లి స్టేషన్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. టేకులపల్లి సీఐ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం మండల కేంద్రంలోని 9వ మైల్ తండాలో కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డెన్ అండ్ సెర్చ్ )ని నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లందు డీఎస్పీ హాజరై మాట్లాడుతూసైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని సూచించారు. బ్యాంక్ ఖాతా, ఏటీఎం పిన్ నెంబర్లు, ఓటీపీ వివరాలు చెప్పవద్దన్నారు. ఆశచూపిస్తే వాటికి ఆకర్షితులు కావొద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే టోల్ఫ్రీ నెంబర్ 1930కు కాల్ చేయాలని సూచించారు. వ్యక్తిగత ఫొటోలను డీపీలుగా పెట్టుకోవద్దన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande