
పెద్దపల్లి, 10 నవంబర్ (హి.స.)
రాజీవ్ రహదారి కి ఇరువైపుల వ్యాపారులు ఆక్రమణలు తొలగించాల్సిందనని పెద్దపల్లి జిల్లా అధికారులు స్పష్టం చేశారు. సోమవారం సుల్తానాబాద్ పట్టణంలోని రాజీవ్ రహదారికి ఇరువైపులా 50 ఫీట్ల వరకు వ్యాపారులు ఆక్రమణలు తొలగించాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్, పోలీస్, ఆర్ అండ్ బి, మున్సిపల్ తో పాటు హెచ్ కె ఆర్ అధికారులు రాజీవ్ రహదారి పై ఉన్న ఆక్రమణలను పరిశీలించారు. వెంటనే వ్యాపారులు 50 ఫీట్ల లోపు వేసుకున్న రేకులను, షెడ్లను తొలగించాలన్నారు. రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతోందని ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండడంతోపాటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వ్యాపారులకు తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు