
హైదరాబాద్, 10 నవంబర్ (హి.స.)
పార్టీ ఫిరాయించిన 10 మంది
ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై 3 నెలల్లోపు విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను సుప్రీం కోర్ట్ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ధర్మాసనం విధించిన మూడు నెలల గడువు అక్టోబర్ 31న ముగియడంతో ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్కు పోటీగా బీఆర్ఎస్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించిందని.. అయినా స్పీకర్ అర్థం లేని విచారణతో కాలయాపన చేస్తున్నారంటూ కోర్టు ధిక్కార పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో నోటిఫై కావాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు