
షాద్నగర్, 10 నవంబర్ (హి.స.)
పేదల కళ్ళలో ఆనందాన్ని నింపి వారి
జీవితాల్లో వెలుగులు పంచడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రాంనగర్ కాలనీలో సోమవారం ఎమ్మెల్యే శంకర్ ఇందిరమ్మ
ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్నారు.
లబ్దిదారులకు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన రమాదేవి దంపతులకు నూతన వస్త్రాలను ఎమ్మెల్యే బహుకరించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు