బ్రిటిష్ ఎయిర్ లైన్కు బాంబు బెదిరింపు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీలు చేస్తున్న అధికారులు
హైదరాబాద్, 10 నవంబర్ (హి.స.) బ్రిటిష్ ఎయిర్ లైన్కు గుర్తు తెలియని దుండగులు బాంబు బెదిరింపు ఈమెయిల్ పంపారు. దీంతో అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బిఏ 277 నెంబర్ విమానంకు ఈరోజు ఉదయం బాంబు బెదిరింపు ఈమెయ
శంషాబాద్ ఎయిర్పోర్ట్


హైదరాబాద్, 10 నవంబర్ (హి.స.)

బ్రిటిష్ ఎయిర్ లైన్కు గుర్తు తెలియని

దుండగులు బాంబు బెదిరింపు ఈమెయిల్ పంపారు. దీంతో అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బిఏ 277 నెంబర్ విమానంకు ఈరోజు ఉదయం బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో విమానంలో ఉన్న 200 మంది ప్రయాణికులతో పాటు పదిమంది క్రూ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అయిన తర్వాత సిఐఎస్ఎఫ్ భద్రతా దళాలు విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande