జడ్జిలపై ఆరోపణల ట్రెండ్ పెరుగుతోంది.. సీజేఐ బీఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, 10 నవంబర్ (హి.స.) కోర్టులో ప్రతికూల తీర్పులొస్తే న్యాయమూర్తులపై ఆరోపణలు చేసే ట్రెండ్ రోజురోజుకూ పెరుగుతోంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ తెలంగాణ హైకోర్టు జడ్జి భట్టాచార్య పై అసత్య అనుచిత వ
సీజేఐ బీఆర్ గవాయ్


న్యూఢిల్లీ, 10 నవంబర్ (హి.స.)

కోర్టులో ప్రతికూల తీర్పులొస్తే

న్యాయమూర్తులపై ఆరోపణలు చేసే ట్రెండ్ రోజురోజుకూ పెరుగుతోంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ తెలంగాణ హైకోర్టు జడ్జి భట్టాచార్య పై అసత్య అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్.పెద్దిరాజు, న్యాయవాదులు రితేశ్ పాటిల్, నితిన్ మేష్రమ్ కేసులో బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల కొంతమంది న్యాయవాదులు, పిటిషనర్లకు వ్యతిరేకంగా తీర్పులొస్తే న్యాయమూర్తులపై అతి దారుణమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న ధోరణి పెరిగుతోందని.. దానినిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande