సైబర్ క్రైమ్, రోడ్ సేఫ్టీ లపై ప్రత్యేక కార్యక్రమాలు : డీజీపీ బి. శివధర్ రెడ్డి..
హైదరాబాద్, 10 నవంబర్ (హి.స.) క్రైమ్ లలో నూతన టెక్నాలజీతో దొంగలు దూకుడు ఆరంభించారని వారికి కళ్లెం వేయడానికి రాచకొండ సీపీ కార్యాలయంలో అన్ని సదుపాయాలతో నూతన టెక్నాలజీతో ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వనున్నామని, సైబర్ క్రైమ్, రోడ్డు సేఫ్టీ పై ప్రత్యేక కార్య
డీజీపీ బి. శివధర్ రెడ్డి..


హైదరాబాద్, 10 నవంబర్ (హి.స.)

క్రైమ్ లలో నూతన టెక్నాలజీతో

దొంగలు దూకుడు ఆరంభించారని వారికి కళ్లెం వేయడానికి రాచకొండ సీపీ కార్యాలయంలో అన్ని సదుపాయాలతో నూతన టెక్నాలజీతో ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వనున్నామని, సైబర్ క్రైమ్, రోడ్డు సేఫ్టీ పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోనున్నామని మేడిపల్లిలో నూతన సీపీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ సెంటర్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో తెలంగాణ డిజిపి బి. శివధర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. దివిస్ లేబరేటరీస్ లిమిటెడ్ చైర్మన్ మురళీకృష్ణ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ద్వారా సుమారు నాలుగు కోట్ల రూపాయల ద్వారా సిటీ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ.. రాచకొండ కమిషనరేట్ ఏర్పడి పది సంవత్సరాలు కావస్తున్నా పూర్తిస్థాయి భవనం లేకపోవడం, అదేవిధంగా సిటీ ట్రైనింగ్ సెంటర్ కూడా లేకపోవడం, కొంత లోపంగానే ఉందని, అది నేటితో తీరనున్నదని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande