అన్ని విద్యాసంస్థల్లో వందేమాతరం తప్పనిసరి.. యూపీ సీఎం ప్రకటన
యూపీ, 10 నవంబర్ (హి.స.) ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఇక నుంచి వందేమాతరం గేయాలాపనను తప్పనిసరి చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలలో వందేమాతరం పాడటం తప్పనిసరి చేస్తున
యూపీ సీఎం ప్రకటన


యూపీ, 10 నవంబర్ (హి.స.)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని

విద్యాసంస్థల్లో ఇక నుంచి వందేమాతరం గేయాలాపనను తప్పనిసరి చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలలో వందేమాతరం పాడటం తప్పనిసరి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గోరఖ్పూర్లో 'ఏక్తా యాత్ర' పేరుతో నిర్వహించిన సామూహిక వందేమాతరం గేయాలాపన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు.

విద్యాసంస్థల్లో జాతీయ గీతాలాపన చేయడంవల్ల విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే దానిపై గౌరవం, దేశభక్తి ఏర్పడుతాయని ప్రకటనలో పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande