ప్రభుత్వం కీలక నిర్ణయం... 70 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం
అమరావతి, 10 నవంబర్ (హి.స.)ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశంలో 70 అజెండా అంశాలపై చర్చ జరిగింది. రాజధాని అభివృద్ధిలో భాగంగా పలు సంస్థలకు భూములు కేటాయింపుతో పాటు రాయితీలు ఇచ్చేందుకు మంత్రులు ఆమోదం తె
ఏపీ కేబినెట్


అమరావతి, 10 నవంబర్ (హి.స.)ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశంలో 70 అజెండా అంశాలపై చర్చ జరిగింది. రాజధాని అభివృద్ధిలో భాగంగా పలు సంస్థలకు భూములు కేటాయింపుతో పాటు రాయితీలు ఇచ్చేందుకు మంత్రులు ఆమోదం తెలిపారు. అలాగే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పేదలకు ఇళ్ల మంజూరు విషయంలో బాధ్యత తీసుకోవాలన్నారు. నివాస స్థలం లేని వారి జాబితా సిద్ధం చేయాలని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం తగదని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande