
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
బెంగళూరు10 నవంబర్ (హి.స.)
పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో (Bengaluru Parappana Central Prison) బందీగా ఉన్న ఐసిస్ రిక్రూటర్ వీఐపీ సౌకర్యాలు పొందుతున్నట్లు చూపిస్తున్న వీడియో ఇటీవల సంచలనం సృష్టించింది. తాజాగా అదే జైల్లో ఖైదీలు మద్యం తాగుతూ పార్టీ చేసుకొంటున్న మరో వీడియో బయటకు రావడంతో అధికారులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీడియోలో జైల్లోని ఖైదీలు పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ, మద్యం పార్టీ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ప్రమాదకర ఘటనల్లో నిందితులుగా తేలిన ఖైదీలకు వీఐపీ సౌకర్యాలు కల్పించినట్లు చూపిస్తున్న వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో సీరియల్ రేపిస్ట్ ఉమేష్ రెడ్డి, అనుమానిత ఐసిస్ రిక్రూటర్ జైల్లో ఫోన్ వాడుతున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఐసిస్ రిక్రూటర్‌కు జైల్లో ఫోన్, టీవీ వంటి సౌకర్యాలు కల్పించినట్లు ఉన్న వీడియో ఇప్పటిది కాదని.. 2023 నాటిదని అధికారులు పేర్కొన్నారు.
.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ