
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
తిరువనంతపురం: 10 నవంబర్ (హి.స.)ఇకపై కేరళ టూరిస్ట్ బస్సులు కర్ణాటక, తమిళనాడుకు వెళ్లవు. ఆ రెండు రాష్ట్రాలకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు కేరళ రాష్ట్ర కమిటీ లగ్జరీ బస్సు యజమానుల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. దీని వెనుకగల కారణం ఏమిటి? ఆయా రాష్ట్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురువుతున్నాయా? అనే విషయంలోకి వెళితే..
కేరళ నుండి తమిళనాడు, కర్ణాటకకు అంతర్రాష్ట్ర పర్యాటక బస్సు సర్వీసులను (నేడు)సోమవారం సాయంత్రం 6 గంటల నుండి నిలిపివేస్తున్నట్లు లగ్జరీ బస్సుల యజమానుల సంఘం, కేరళ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. పొరుగు రాష్ట్రాలు భారీ జరిమానాలు విధించడం, చట్టవిరుద్ధమైన రాష్ట్ర స్థాయి పన్నులు విధించడం, దీనికితోడు కేరళ ఆపరేటర్లకు చెందిన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ (ఏఐటీపీ) బస్సులను సీజ్ చేయడం తరచూ జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏజే రిజాస్ తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ