
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
కోల్‌కతా: 10 నవంబర్ (హి.స.) కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి స్పైస్‌జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యిదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం కోల్‌కతాకు చేరుకుంటుండగా, విమానం ఇంజిన్లలో ఒకటి పనిచేయకపోవడాన్ని పైలట్ గుర్తించి, విమానాశ్రయంలో ఆ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
విమానంలో తలెత్తిన సమస్యను గుర్తించిన పైలట్ తక్షణం కోల్‌కతా విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. తరువాత ముంబై నుండి కోల్‌కతాకు ప్రయాణికులను తీసుకెళ్తున్న ఎస్‌జీ 670 విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. రాత్రి 11:38 గంటలకు అత్యవసర పరిస్థితిని ఉపసంహరించుకున్నారు. అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు, వైద్య సిబ్బందితో కూడిన విమానాశ్రయ అత్యవసర ప్రతిస్పందన బృందాన్ని వెంటనే మోహరించామని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ