
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.cf4{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf5{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 10 నవంబర్ (హి.స.)
దేశంలో వ్యవస్థీకృత పన్ను ఎగవేత నెట్‌వర్క్‌పై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) సంచలన విషయాలు బయటపెట్టింది. రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలు (RUPP), చార్టర్డ్ అకౌంటెంట్లు (CA), మధ్యవర్తుల సహకారంతో రూ.9,169 కోట్ల విలువైన నిధులను లాండరింగ్ చేస్తూ పన్ను ఎగవేత కోసం రాజకీయ విరాళాలుగా మళ్లిస్తున్న ఒక భారీ రాకెట్‌ను సీబీడీటీ వెలుగులోకి తీసుకొచ్చింది.
అదనపు పన్ను మినహాయింపులు
సీబీడీటీ చర్యకు సంబంధించి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, 2022–23, 2023–24 సంవత్సరాల్లో చట్టబద్ధంగా ప్రకటించిన రాజకీయ రసీదులతో పోలిస్తే రూ.9,169 కోట్లు అదనపు పన్ను మినహాయింపులు క్లెయిమ్ అయ్యాయి. అందులో..
2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి రూ.6,116 కోట్లు
2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి రూ.3,053 కోట్లు
భారత ఎన్నికల సంఘం ఇటీవల 800 RUPPలను రద్దు చేసిన తర్వాత రాజకీయ విరాళ చట్టాల్లోని లొసుగులను RUPPలు దుర్వినియోగం చేస్తున్నాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సీబీడీటీ దర్యాప్తు చేసినట్లు తెలిసింది.
9
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ