
తెలంగాణ, 11 నవంబర్ (హి.స.) తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతోంది. నిన్నటి వరకు డబుల్ డిజిట్ ఊష్ణోగ్రతలు కనిపించగా నేడు ఏకంగా సింగిల్ డిజిట్కు పడిపోయాయి. కొమురంభీం అసిఫాబాద్ జిల్లాల్లో ఈరోజు డిగ్రీల సెల్సియల్ ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్లో 10.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అంతే కాకుండా నిర్మల్లో 11.7 డ్రీగ్రీలు, కామారెడ్డిలో 12 డిగ్రీలు, సంగారెడ్డిలో 12 డిగ్రీలు, మెదక్ రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాల్లో 13 డిగ్రీల సెల్సియస్ ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక హైదరాబాద్లోనూ చలి కుమ్మేస్తోంది. నగరంలోని హెచ్సీయూ షేర్లింగంపల్లిలో 13.4 డిగ్రీల సెల్సియస్ ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజేంద్రనగర్లో 14.7 డిగ్రీలు, గచ్చిబౌలిలో 15 డిగ్రీలు, మారెడ్పల్లిలో 15.2 డిగ్రీలు, గాజులరామారంలో 15.7 డిగ్రీలు, నేరెడ్మెట్లో 15.9 డిగ్రీలు, బేగంపేట్లో 16.2 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో చలితీవ్రత పెరగటంతో వృద్ధులు, చిన్నపిల్లు రాత్రి, తెల్లవారుజామున బయటకు రాకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు