
కర్నూలు, 11 నవంబర్ (హి.స.)
: నర్సింగ్, డిప్లొమా అభ్యర్థులను జర్మనీ రారమ్మని పిలుస్తోంది. నెలకు రూ.లక్షల వేతనాలతో వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఊరిస్తున్నాయి. ఈ అవకాశాలను యువతకు చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అభ్యర్థులకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెలకువలు నేర్పిస్తోంది. కోర్సు పూర్తయ్యాక సర్టిఫికెట్‌తోపాటు ప్రభుత్వమే జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ