
మార్కాపురం, 27 జూన్ (హి.స.)
, :వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ప్రజల కోసమే కూటమి ఏర్పడిందన్నారు. ఈరోజు(శనివారం) జిల్లాలోని గిద్దలూరు మండలం కిష్టంశెట్టిపల్లిలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. 3 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామన్నారు. అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని.. ఏటా రైతులకు రూ.20 వేలు ఇస్తున్నామని చెప్పారు. మనసున్న ప్రభుత్వం కాబట్టే ప్రజలకు అన్నీ చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పెరిగాయని.. ప్రైవేటు స్కూళ్ల నుంచి లక్ష మంది ప్రభుత్వ బడుల్లో చేరారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ