
అమరావతి, 27 జూన్ (హి.స.)
మార్కాపురం, : నాలుగు జిల్లాల తలరాతలు మార్చే ప్రాజెక్టు వెలిగొండ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈరోజు(శనివారం) దోర్నాల మండలం గంటావానిపల్లిలో వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు, రైతులతో సీఎం సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. నీళ్లు లేక చాలా మంది ఫ్లోరైడ్ వాటర్ తాగుతున్నారని.. కృష్ణా నదీ జలాలు ఈ ప్రాంతానికి వస్తాయని ఎవరూ ఆలోచన చేసి ఉండరని తెలిపారు. రాయలసీమ, మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకురావాలని ఎన్టీఆర్ ఆలోచన చేశారని గుర్తుచేశారు.1996 మార్చి 26న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించామని.. రూ.900 కోట్లు పునరావాసం కోసం కేటాయించామని అన్నారు. రూ.300 కోట్లు మొదటి విడతలో నిర్వాసితులకు ఇస్తున్నామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ