భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం తేదీని త్వరలోనే ప్రకటిస్తాం
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం తేదీని త్వరలోనే ప్రకటిస్తాం
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం తేదీని త్వరలోనే ప్రకటిస్తాం


అమరావతి, 27 జూన్ (హి.స.)

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త కిషోర్ అన్నారు. విశాఖ- భోగాపురం ఎయిర్పోర్టు అనుసంధానానికి సంబంధించి 7 రోడ్లలో ఐదింటిని పూర్తి చేసినట్లు చెప్పారు. విశాఖ నుంచి డెడికేటెడ్ ఆర్టీసీ బస్సు సర్వీసులను నడుపుతామన్నారు. ‘‘ ఎయిర్పోర్టు కోసం డెడికేటెడ్ బస్ బే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే, విశాఖ ఎయిర్పోర్టు కొనసాగుతుందనీ, దాని కార్యకలాపాలు మాత్రం భోగాపురం నుంచి నిర్వహించబోతున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande