ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్.మృతి ఓసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం
ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్.మృతి ఓసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం
ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్.మృతి ఓసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం

అమరావతి, 27 జూన్ (హి.స.)

అమరావతి, ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె. భాగ్యరాజ్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. భాగ్యరాజ్ కన్నుమూశారని తెలిసి చింతించానని చెబుతూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. రచయితగా, సహాయ నటుడిగా భాగ్యరాజ్ సినీ జీవితాన్ని ప్రారంభించారన్నారు. అనంతరం తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయన దర్శకత్వం వహించిన, కథ-స్క్రీన్ప్లే అందించిన అనేక చిత్రాలు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రీమేక్ అయి ఘనవిజయం సాధించాయని గుర్తు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande