
మచిలీపట్నం, 17 నవంబర్ (హి.స.)
(నేర విభాగం): చోరీ కేసులో ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 318 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు చిలకలపూడి పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు వివరాలను డీఎస్పీ రాజా మీడియాకు వెల్లడించారు. చిలకలపూడి పోలీసు స్టేషన్ పరిధిలో గత అక్టోబర్‌లో చోరీ కేసు నమోదైంది. టెక్నికల్ టీమ్ సాయంతో నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కృష్ణా జిల్లాలోనే కాకుండా నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోనూ నిందితులు చోరీలకు పాల్పడినట్లు చెప్పారు. అనేక కేసుల్లో చోరీకి గురైన 318 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీసులను డీఎస్పీ
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ