
హైదరాబాద్, 18 నవంబర్ (హి.స.)
వారణాసి ఈవెంట్లో దర్శకధీరుడు
రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.ఈ నేపథ్యంలోనే బీజేపీ నేత మాధవీలత స్పందించారు. మీకు ఏవో ఇబ్బందులు కలిగి వీడియోను రిలీజ్ చేయలేదని అన్నారు.
ఆంజనేయస్వామి వెనకుండి నడిపిస్తాడని అంటే భావ్యంగా అనిపించడం లేదన్నారు.. మరి బాహుబలి సినిమాలో ప్రభాస్ చేత శివలింగాన్ని ఎత్తించి కోట్లు సంపాదించారన్నారు. అప్పుడు శివుడి కోసం ఏమైనా చేశారా.. శివుడి ఆలయాలకు దాన ధర్మాలు చేశారా అని ప్రశ్నించారు. కుల వృత్తులు చేసుకునేవాళ్లు వాళ్ల పనిముట్లను గౌరవిస్తారని సంపాదించుకునేందుకు అన్నారు. డబ్బు భగవంతుడు ఉపయోగపడ్డాడు అని ఆయన పట్ల గౌరవం ఉంచడం మీలాంటి వాళ్లకు సామాజిక స్పూర్తిగా ఉండాలన్నారు. ప్రజలు మనల్నిచూసి చైతన్యవంతం అవుతారన్నారు. ఏదో సీన్లు, షాట్లు తీశారు కాబట్టి మీ వెనక ఆంజనేయస్వామి లేరని అనుకుంటున్నారని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..