విద్యార్ధుల తల్లి.తండ్రులకు గుడ్ న్యూస్
అమరావతి, 18 నవంబర్ (హి.స.) : విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్. ఇది.. మీ పిల్లల ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు సులభమైన మార్గం. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు ప్రభుత్వం ఆధార్ అప్డేట్ చేసుకునే అవకాశాన్ని పాఠశాలల్లోనే కల్పిస్తోంది. నిన్నటి (నవంబర్
విద్యార్ధుల తల్లి.తండ్రులకు గుడ్ న్యూస్


అమరావతి, 18 నవంబర్ (హి.స.)

: విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్. ఇది.. మీ పిల్లల ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు సులభమైన మార్గం. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు ప్రభుత్వం ఆధార్ అప్డేట్ చేసుకునే అవకాశాన్ని పాఠశాలల్లోనే కల్పిస్తోంది. నిన్నటి (నవంబర్ 17) నుంచి నవంబర్ 26 వరకు స్కూల్స్‌లలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు.

ఫలితంగా 5 నుంచి 15 ఏళ్లలోపు విద్యార్థులు తమ ఆధార్ కార్డ్‌ను వారి వారి పాఠశాలల్లోనే అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సెంటర్లలో గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన పని లేకుండా ఏపీ విద్యాశాఖ, యూఐడీఏఐ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దీనిపై గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే లేఖ రాశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande