
అమరావతి, 18 నవంబర్ (హి.స.)
:బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు ముహూర్తం ఖరారు అయింది. సీఎం నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లకు ఆహ్వానం అందింది. నవంబర్ 20వ తేదీన వీరు బిహార్ వెళ్లనున్నారు. బిహార్ రాజధాని పాట్నాలో జరిగే సీఎం నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే తరఫున ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆ రాష్ట్ర పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన పలు సమావేశాల్లో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంబంధించిన వివరాలను బిహార్‌లోని పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ