
తెలంగాణ, 17 నవంబర్ (హి.స.)
నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో చేపల సంపద పెంపు లక్ష్యంగా శనివారం చేప పిల్లలను రిజర్వాయర్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ వద్ద శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి చేప పిల్లల వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయవీర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మత్స్యకారుల కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మత్స్యకారుల జీవితాల్లో స్థిరమైన మార్పు తీసుకువచ్చే దిశగా పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, మత్స్యకారులు మత్స్య సంపదను పెంచుకొని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు