వణికిస్తున్న చలి.. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
సంగారెడ్డి, 17 నవంబర్ (హి.స.) సంగారెడ్డి జిల్లాలో చలి తాండవిస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతుండడంతో ఈ ప్రాంతాల గ్రామాలు, పట్టణాలు గజగజ వణుకుతున్నాయి. ఉదయం 8 గంటల వరకు ప్రజలు ఇంటి నుండి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయ
చలి


సంగారెడ్డి, 17 నవంబర్ (హి.స.)

సంగారెడ్డి జిల్లాలో చలి తాండవిస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతుండడంతో ఈ ప్రాంతాల గ్రామాలు, పట్టణాలు గజగజ వణుకుతున్నాయి. ఉదయం 8 గంటల వరకు ప్రజలు ఇంటి నుండి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి చలి మరింతగా వణికిస్తోంది. సోమవారం జిల్లాలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోహిర్ పట్టణంలో 7.1 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రతగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రతకు తోడు చల్ల గాలులు వీయడంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande