విద్యార్థులు కష్టపడి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
పెద్దపల్లి, 17 నవంబర్ (హి.స.) గురుకులాల పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. సోమవారం మంథని పట్టణం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలకు స
ఎస్సీ ఎస్టీ


పెద్దపల్లి, 17 నవంబర్ (హి.స.)

గురుకులాల పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. సోమవారం మంథని పట్టణం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలకు సంబంధించిన పలు రికార్డులను ఆయన పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... ప్రభుత్వం గురుకులాల పైన ప్రత్యేక శ్రద్ధ వహించిందని, విద్యార్థులు గురుకులాలను జీవితంలో ఉన్నత స్థాయికి ఉపయోగించుకొని చేరుకోవాలని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande