
హైదరాబాద్, 17 నవంబర్ (హి.స.)
సౌదీ అరేబియా బస్సు ప్రమాదంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ స్పందించారు. సౌదీ ప్రమాదంలో పూర్తి వివరాలను తెలుసుకునేందుకు హోంమంత్రి అమిత్ షా సౌదీ సర్కారుతో మాట్లాడుతున్నారని వెల్లడించారు.ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
బస్సు ప్రమాదంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. మక్కా యాత్రకు వెళ్లిన ప్రయాణికులు చనిపోవడం బాధాకరమన్నారు. ప్రమాదంలో జరిగిన బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిలో హైదరాబాద్ కు చెందినవారు మరణించారని తెలిపారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన ప్రయాణికుల్లో మహమ్మద్ షోయబ్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయపడ్డారని ప్రకటించారు.
ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సౌదీలో కాన్సులేట్ వాళ్లతో సంప్రదిస్తున్నామని తెలిపారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.హైదరాబాద్ లో ఉమ్రా యాత్రకు ప్రయాణికులను పంపే ఏజెన్సీలతో పోలీసులు మాట్లాడుతున్నారని, ఉమ్రా యాత్రకు వెళ్లిన వారి పూర్తి సమాచారం తెలుసుకుంటున్నామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు