ఆంధ్రప్రదేశ్.ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం కడప జిల్లాలో. పర్యటించనున్నారు
కడప, 18 నవంబర్ (హి.స.) , :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం రోజు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ''అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్'' కార్యక్రమంలో పాల్గొనేందుకు గానూ ఆయన కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రికి వెళ్లనున్నట్టు అధికారిక
ఆంధ్రప్రదేశ్.ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం కడప జిల్లాలో. పర్యటించనున్నారు


కడప, 18 నవంబర్ (హి.స.)

, :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం రోజు కడప జిల్లాలో పర్యటించనున్నారు. 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' కార్యక్రమంలో పాల్గొనేందుకు గానూ ఆయన కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రికి వెళ్లనున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్ ప్రకారం.. మధ్యాహ్నం 1 గంటకు హెలికాఫ్టర్ ద్వారా పెండ్లిమర్రికి చేరుకోనున్న ముఖ్యమంత్రి.. వెల్లటూరులోని మన గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1:40 గంటలకు పెండ్లిమర్రిలో ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4:20 గంటలకు చిన్నదొరసారిపల్లెలో రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. 5:15 గంటలకు వెల్లటూరులో పార్టీ సభ్యులతో సమావేశం నిర్వహించి.. పలు అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. కార్యక్రమం ముగిశాక సాయంత్రం 6:40 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్ నుంచి విజయవాడకు తిరుగు పయనం కానున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande