హిడ్మా ఎన్ కౌంటర్ బూటకం: కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్, 18 నవంబర్ (హి.స.) మావోయిస్టు అగ్రనేత హిడ్మ ఎన్కౌంటర్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరరావు స్పందించారు. మావోయిస్టులను చంపుకుంటూ పోవడమంటే మానవ హననం తప్ప మరొకటి కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జ
కూనమనేని


హైదరాబాద్, 18 నవంబర్ (హి.స.)

మావోయిస్టు అగ్రనేత హిడ్మ ఎన్కౌంటర్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరరావు స్పందించారు. మావోయిస్టులను చంపుకుంటూ పోవడమంటే మానవ హననం తప్ప మరొకటి కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జంగిల్ రాజ్ పరిపాలనకు ఇది పరాకాష్ట అని విమర్శించారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. కేంద్ర ప్రభుత్వ జంగిల్ రాజ్ పరిపాలనలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు కూడా పావులుగా మారారని ధ్వజమెత్తారు. ఇవాళ మారేడుమిల్లిలో జరిగిన హిడ్మా ఎన్కౌంటర్తో పాటు గతంలో మావోయిస్టులపై జరిగినవన్నీ ఫేక్ ఎన్కౌంటర్స్ అని ఆరోపించారు. బూటకపు ఎన్ కౌంటర్స్తో మనుషులను చంపుకునే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదని, మావోయిస్టులు ఏదైన నేరాలు చేసివుంటే వారిని అరెస్టు చేసి చట్టభద్దంగా విచారణ జరిపించాలని ఇలాంటి ఫేక్ ఎన్కౌంటర్లు చేయడం విచారణకరమని అన్నారు. మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande