పంతాలకు పోయి.. ప్రాణాలు తీసుకోవద్దు.. కేంద్ర మంత్రి బండి సంజయ్
రాజన్న సిరిసిల్ల, 18 నవంబర్ (హి.స.) మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్కౌంటర్పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. తుపాకీ ద్వారా మావోయిస్టులు ఏం సాధించలేరని తెలిపారు. తుపాకులు ఉండాల్సింది పోలీసుల చేతుల్లో.. మావోయిస్టుల చేతుల్లో కాదని స్ప
బండి సంజయ్


రాజన్న సిరిసిల్ల, 18 నవంబర్ (హి.స.) మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్కౌంటర్పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. తుపాకీ ద్వారా మావోయిస్టులు ఏం సాధించలేరని తెలిపారు. తుపాకులు ఉండాల్సింది పోలీసుల చేతుల్లో.. మావోయిస్టుల చేతుల్లో కాదని స్పష్టం చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఏరియా ఆస్పత్రికి రూ.1.5 కోట్ల విలువైన వైద్య పరికరాల అందజేత కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టుల చేతుల్లో తుపాకులు ఉంటే చర్చల ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇప్పటివరకు లొంగిపోయిన మావోయిస్టులకు ఇబ్బందులు కలిగించలేదని గుర్తుచేశారు. బుల్లెట్ నమ్ముకుని మావోయిస్టులు ప్రాణాలు తీసుకుంటున్నారు.. మేం బ్యాలెట్ నమ్ముకుని అధికారంలోకి వచ్చామని స్పష్టం చేశారు. అడవుల్లో ఆదివాసీలు, గిరిజనులను మావోయిస్టు చంపుతున్నారని విమర్శించారు. ఆపరేషన్ కగార్లో ఆదివాసీలు, గిరిజనుల మరణాలకు అర్బన్ నక్సల్స్ కారణమని ఆరోపించారు. అర్బన్ నకల్స్ పట్టణాల్లో జల్సాలు చేస్తుంటే.. అడవుల్లో పేద గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande