2047 'తెలంగాణ రైజింగ్' ఉత్సవాలకు రాష్ట్రం సిద్ధం.. డిప్యూటీ సీఎం
హైదరాబాద్, 18 నవంబర్ (హి.స.) రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 8, 9 తేదీల్లో భారీగా నిర్వహించనున్న ''తెలంగాణ రైజింగ్ 2047 ఉత్సవాల్లో కీలక విధానాలను ప్రకటించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం బేగంపేట్లో జరిగిన 47వ SLBC త్రైమాసిక
భట్టి


హైదరాబాద్, 18 నవంబర్ (హి.స.)

రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 8, 9 తేదీల్లో భారీగా నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్ 2047 ఉత్సవాల్లో కీలక విధానాలను ప్రకటించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం బేగంపేట్లో జరిగిన 47వ SLBC త్రైమాసిక బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకులు కీలక భాగస్వాములవ్వాలని కోరారు. 2047 కోసం మూడు ట్రిలియన్ ఆర్థికవ్యవస్థ లక్ష్యంగా, 13% జీడీపీ వృద్ధి రోడ్మ్యప్ను విడుదల చేయబోతున్నాం అని చెప్పారు. విద్యుత్ డిమాండ్ ఏటా 10% పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం ప్రధాన దృష్టి పెట్టిందన్నారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థ, మౌలిక వసతులు, ఎంఎస్ఎంఈలు, మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధి రాష్ట్ర భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తాయని భట్టి విక్రమార్క తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande