
నల్గొండ, 18 నవంబర్ (హి.స.) కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన
ఆరు గ్యారంటీలలో భాగంగా రైతు భరోసా కింద ప్రతి ధాన్యం గింజకు మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. మంగళవారం పోలేపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్) ఆవరణలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రైతులు తమ ఉత్పత్తిని సకాలంలో తీసుకొచ్చి అమ్ముకోవచ్చని తెలిపారు. డబ్బులు 48 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ అవుతాయని హామీ ఇచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు