దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు.. దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు
హైదరాబాద్, 18 నవంబర్ (హి.స.) టాలీవుడ్ అగ్రదర్శకుడు రాజమౌళిపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. రాష్ట్రీయ వానరసేన ఆయనపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో ఆయన.. త
Rajamouli


హైదరాబాద్, 18 నవంబర్ (హి.స.)

టాలీవుడ్ అగ్రదర్శకుడు రాజమౌళిపై

సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. రాష్ట్రీయ వానరసేన ఆయనపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో ఆయన.. తనకు దేవుడిపై నమ్మకం లేదంటూ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు... వారణాసి టైటిల్ లాంఛ్ ఈవెంట్ లో చిన్న టెక్నికల్ ఇష్యూ తలెత్తింది. దీంతో కాసేపు కార్యక్రమానికి అంతరాయం ఏర్పడింది. భావోద్వేగానికి గురైన రాజమౌళి.. తాను అందుకే దేవుడిని నమ్మనన్నారు. కానీ.. తన తండ్రి విజయేంద్ర తన వద్దకు వచ్చి హనుమంతుడే వెనుక ఉండి నడిపిస్తాడని చెప్పారన్నారు. తన భార్య రమకు కూడా ఆంజనేయస్వామి అంటే చాలా ఇష్టమని, ఆయన్ను ఫ్రెండ్ లా చూస్తుందన్నారు. కానీ.. ఈవెంట్లో ఇలా జరిగే సరికి.. తన భార్య మీద కూడా కోపం వచ్చిందని, దేవుడు ఇలానేనా అనిపించిందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande