
రాజమండ్రి 18 నవంబర్ (హి.స.)తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో అటవీ శాఖ ఉద్యోగాల పేరుతో భారీ మోసం బయటపడింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఇప్పిస్తామని నమ్మించి, ఇద్దరి నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేయాలని చూస్తున్న ఇద్దరు వ్యక్తులను రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉప్పాడ కొత్తపల్లి నివాసి నవంత్, ఆలమూరు చెందిన రాజ్‌కుమార్.. ఇద్దరూ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వేళ, ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న వ్యక్తి సూచనతో జల్లూరు రాజ్‌కుమార్, యర్రంశెట్టి ప్రసాద్‌లను పరిచయం చేసుకున్నారు. ఇద్దరూ “అటవీ శాఖలో పోస్టులు ఇప్పిస్తాం.. ఒక్కరికి 10 లక్షల రూపాయాలు ఖర్చు అవుతుందని పురమాయించారు.. డబ్బులు తీసుకునేందుకు రాజమండ్రి కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కార్యాలయం ఎదురుగా పిలిపించిన రాజ్‌కుమార్, నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇవ్వడంతో నిరుద్యోగులకు అనుమానం వచ్చి రేంజ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. ఒత్తిడితో రాజ్‌కుమార్ మరో వ్యక్తి ప్రసాద్‌ను కూడా అక్కడికే రప్పించగా, ఇద్దరిపై పోలీసుల ఫిర్యాదు చేశారు.. దీంతో కేసు నమోదు చేశారు పోలీసులు.. రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో FIR నంబర్ 282/2025గా కేసు నమోదు చేసి సీఐ మురళీకృష్ణ దర్యాప్తు ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ