పారదర్శకంగా వేగంగా ధాన్యం కొనుగోలు చేయాలి: జగిత్యాల జిల్లా కలెక్టర్
తెలంగాణ, 18 నవంబర్ (హి.స.) జగిత్యాల రూరల్ మండలంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా వేగంగా ధాన్యం కొనుగ
జగిత్యాల కలెక్టర్


తెలంగాణ, 18 నవంబర్ (హి.స.)

జగిత్యాల రూరల్ మండలంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా వేగంగా ధాన్యం కొనుగోలు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. తేమ శాతం తప్పనిసరిగా పరిశీలించి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే కొనుగోలు చేయాలని ఆయన అన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం స్వీకరణ తూకం వేసే విధానాన్ని 17% శాతం తేమ నిర్వహణను దగ్గరుండి పరీక్షించారు, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వాహనాల ద్వారా తక్షణమే రైస్ మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని కొనుగోలు కేంద్రాల కేటాయించిన క్లస్టర్ అధికారులు రైతులకు అవసరమైన సేవలు తాగునీరు బరువు యంత్రాలు నిర్వహణ ధాన్యం కొనుగోలు వంటి అంశాలను నిరంతరం పరీక్షించాలని ఆయన అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande