ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అక్రమాలకు తావులేదు: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
నాగర్ కర్నూల్, 18 నవంబర్ (హి.స.) ప్రజా సంక్షేమానికే ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కడ్తాల్ మండల కేంద్రంలోని ఎంబీఏ గార్డెన్ లో కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ 84 మంది లబ్ధిదారులకు చెక్కులను
కల్వకుర్తి ఎమ్మెల్యే


నాగర్ కర్నూల్, 18 నవంబర్ (హి.స.) ప్రజా సంక్షేమానికే ప్రభుత్వం పెద్దపీట

వేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కడ్తాల్ మండల కేంద్రంలోని ఎంబీఏ గార్డెన్ లో కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ 84 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అధికారులు నాయకులు పారదర్శకంగా వ్యవహరించాలని, ఎలాంటి అక్రమాలు జరిగిన సహించేది లేదని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా సంక్షేమానికే ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా నిలపడంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ప్రజాపాలన ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande