
కాకినాడ, 18 నవంబర్ (హి.స.)కాకినాడ జిల్లాలోనూ ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో దొరికిన డైరీ ఆధారంగా వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే వీరి వివరాలను మాత్రం పోలీసులు గుట్టుగా ఉంచుతున్నారు. మరికాసేపట్లో ఇద్దరు మావోయిస్టులను చూపించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అటు ఏలూరులోనూ మావోయిస్టుల కలకలం రేగింది. ఏలూరు గ్రీన్ సిటీలో తలదాచుకున్న మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. దాదాపు 15 మంది మావోలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేహౌండ్ పోలీసులు అత్యంత రహస్యంగా ఆపరేషన్ కగార్‌ను నిర్వహించారు. గ్రీన్ సిటీలోని ఒక ఇంటిలో గత వారం రోజులుగా మావోలు తలదాచుకున్నట్లు సమాచారం
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు