
జనగామ, 18 నవంబర్ (హి.స.)
రిజర్వాయర్లలో పెద్ద సైజు
చాప పిల్లలను పోయాలని మత్స్యశాఖ అధికారులను స్టేషన్గన్పూర్ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశించారు. మంగళవారం లింగాల గణపురం మండలంలోని నవాబుపేట రిజర్వాయర్ లో ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా అందిస్తున్న చాప పిల్లలను వారు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న చేపలను పంపిణీ చేయడం వల్ల మత్స్యకారులు నష్టపోతారని, పెద్ద సైజు పోస్తే ఆరు నెలల్లో చాప పిల్ల పెరుగుతుందని, మత్స్యకారులు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అన్నారు.
మత్స్యకారుల జీవన ఉపాధి కోసం ప్రభుత్వం 123 కోట్ల రూపాయలతో ఉచిత చాప పిల్ల పంపిణీ చేస్తుందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు