
హైదరాబాద్, 18 నవంబర్ (హి.స.)
డ్రగ్ మహమ్మారి పై ఉక్కు పాదం
మోపి మత్తు రహిత తెలంగాణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మంచి లక్ష్యాలను సాధించాలంటే డ్రగ్స్ కు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. సరదాతో అలవాటయ్యే చెడు అలవాట్లు జీవితాన్ని నాశనం చేస్తాయన్నారు. డ్రగ్స్ కు దూరంగా.. జీవిత లక్ష్యాలకు దగ్గరగా అనే సందేశాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా చూడాలన్నారు.
మంగళవారం గాంధీ మెడికల్ కళాశాలలోని స్వామి వివేకానంద ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర దివ్యాంగులు వయోవృద్ధులు అండ్ ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత చదువు, ఉద్యోగ అవకాశాలు, వ్యక్తిత్వ వికాసం లో నిలబెట్టడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా ఉందని మంత్రి అన్నారు. మత్తు పదార్థాల పెరుగుతున్న దుష్ప్రభావాల నేపథ్యంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించిందని చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా మార్గాలను పూర్తిగా నిర్మూలించడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈగల్ స్పెషల్ యూనిట్ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..