ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్..!
నాగర్ కర్నూల్, 18 నవంబర్ (హి.స.) నాగర్ కర్నూలు జిల్లా బిజినేయపల్లి మండలంలోని మంగనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత, పరిశుభ్రత, ర
నాగర్ కర్నూల్ కలెక్టర్


నాగర్ కర్నూల్, 18 నవంబర్ (హి.స.) నాగర్ కర్నూలు జిల్లా బిజినేయపల్లి

మండలంలోని మంగనూరు ప్రాథమిక

ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత, పరిశుభ్రత, రికార్డు నిర్వహణపై కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. చికిత్స కోసం వచ్చిన రోగులతో కలెక్టర్ మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని సదుపాయాలు, సిబ్బంది ప్రవర్తన, వైద్య సేవల నాణ్యతపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య సేవల కొరకు వచ్చే ప్రజలకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, సమయపాలనను పాటించాలని ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande