సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వాయిదా
న్యూఢిల్లీ, 18 నవంబర్ (హి.స.) తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి వాయిదా పడింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు తరపు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో కేసు విచారణను జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం డిసెంబర్ 9కి వాయి
ఫోన్ టాపింగ్ కేసు


న్యూఢిల్లీ, 18 నవంబర్ (హి.స.)

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి వాయిదా పడింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు తరపు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో కేసు విచారణను జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం డిసెంబర్ 9కి వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కీలక అధారాలను ప్రభాకర్ రావు ధ్వంసం చేశారని, డిజిటల్ డివైజ్లకు సంబంధించిన పాస్వర్టులు కూడా ఇవ్వకుండా విచారణకు సహకరించడం లేదని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. దీంతో ఫోరెన్సిక్ నిపుణుల ముందు ఐ క్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలని గత విచారణలో ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande