
డిల్లీ, 18 నవంబర్ (హి.స.) భారత్ లో ఫేమస్ పొలిటికల్, ఎలెక్షన్
స్ట్రాటజిస్ట్, జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో చిత్తుగా ఒదిన సంగతి తెలిసిందే. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోవడంపై కిశోర్ తొలిసారి ప్రశాంత్ స్పందించారు. ఓటమికి 100% తనదే బాధ్యత అని తెలిపారు. మేం నిజాయితీగా ప్రయత్నించినప్పటికీ, విఫలమయ్యామని అన్నారు. మా ఆలోచనలను వివరించిన విధానంలో ఏదో పొరపాటు జరిగిందని తెలిపారు. ఓటమిని ఒప్పుకోవడంలో తనకు మొహమాటం లేదని పేర్కొన్నారు. తాము అధికారంలో మార్పు తీసుకురాలేకపోయినప్పటికీ రాష్ట్ర రాజకీయాలను మార్చడంలో కొంత పాత్ర పోషించామని పీకే చెప్పుకొచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకొని, ప్రజల ముందుకు వస్తామని తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు