ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్
ఖమ్మం, 18 నవంబర్ (హి.స.) ఖమ్మం జిల్లా ఏనుకూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, తగు సూచనలు సలహాలు ఇచ్చారు. కళాశాలలో అసంపూర్
అడిషనల్ కలెక్టర్


ఖమ్మం, 18 నవంబర్ (హి.స.)

ఖమ్మం జిల్లా ఏనుకూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, తగు సూచనలు సలహాలు ఇచ్చారు. కళాశాలలో అసంపూర్తిగా ఉన్న టాయిలెట్స్ను ఉపయోగంలో తెచ్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. కళాశాలలో విద్యార్థుల కోసం ఉన్న క్రీడాస్థలానికి చుట్టూ ట్రాక్ నిర్మాణం జరిగేలా చూడాలని సంబంధిత మండల అధికారులకు సూచించారు.

కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి. బాగా చదువుకొని మంచి స్థానంలో స్థిరపడాలని పలువురుకు ఉపయోగపడే విధంగా ఉండాలని కళాశాల విద్యార్థులకు సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande