
సంగారెడ్డి, 18 నవంబర్ (హి.స.)
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం
కడ్పల్ గ్రామంలోని సామ్రాట్ ఫుడ్ ఇండస్ట్రీస్లో మంగళవారం విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సివిల్ సప్లైస్ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో రబీ మరియు ఖరీఫ్ 2024-25 సీజను సంబంధించిన సుమారు 40,834.98 క్వింటాళ్ల CMR ధాన్యం (1,02,087 బస్తాలు) నిల్వ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు 9 కోట్ల 47 లక్షల 37 వేలకు పైగానే ఉంటుందని అంచనాకు వచ్చారు.
అంతేకాకుండా నిన్న సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మార్డి గ్రామంలోని వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్లో తనిఖీ చేశారు. ఖరీఫ్ 2024-25 సీజన్కు సంబంధించిన 3313 క్వింటాళ్ల CMR ధాన్యం (8283 బస్తాలు) నిల్వ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.76 లక్షల 86 వేలకు పైగా ఉంటుందని అంచనాకు వచ్చారు. మిల్లర్పై తదుపరి చర్యలు ప్రారంభించేందుకు సంగారెడ్డి జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు సిద్ధమయ్యారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు