
అమరావతి, 18 నవంబర్ (హి.స.)
సత్య దేవుని భక్తులకు షాక్ ఇచ్చారు అధికారులు.. వసతి గదుల అద్దె భారీగా పెంచారు.. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో భక్తుల కోసం ఉన్న వసతి గదుల అద్దెలను దేవస్థాన అధికారులు పెంచారు. ఈ కొత్త అద్దెలు డిసెంబర్ 1వ తేదీ నుండి అమల్లోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. భక్తుల రద్దీ పెరగడం, నిర్వహణ ఖర్చులు అధికమవడం, సౌకర్యాల మెరుగుదల వంటి కారణాల వల్ల అద్దెల పెంపుదల నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థాన వర్గాలు తెలిపాయి.
కొత్త అద్దెల వివరాల్లోకి వెళ్తే.. హరిహర సదన్‌లో ఇప్పటికి వరకు అద్దె రోజుకు (24 గంటలకు) రూ.950గా ఉండగా.. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆ మొత్తాన్ని రూ.1,500కి పెంచారు.. సత్రం గది రోజుకు రూ.600గా ఉంటే… ఆ మొత్తాన్ని రూ.800కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. ఇక, ప్రకాశ్ సదన్‌లో ఇప్పటి వరకు రోజుకు రూ.999గా ఉండగా.. డిసెంబర్ 1వ తేదీ నుంచి రూ.1,260 వసూలు చేయనున్నారు.. న్యూ CCC/ఓల్డ్ CCC లో రూ.500 ఇప్పుడు వసూలు చేస్తుండగా.. ఇకపై రూ.700కు చెల్లించాల్సి ఉంటుంది.. సౌకర్యాల మెరుగుదల కోసం
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ