ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతాం: ఎమ్మెల్యే గాంధీ
హైదరాబాద్, 18 నవంబర్ (హి.స.) నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని, ప్రజా అవసరాలను అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ అన్నారు. మంగళవారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్
ఎమ్మెల్యే గాంధీ


హైదరాబాద్, 18 నవంబర్ (హి.స.)

నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని, ప్రజా అవసరాలను అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ అన్నారు. మంగళవారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి గౌలిదొడ్డిలో రూ.40.00 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే స్ట్రాం వాటర్ డ్రెయిన్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గౌలిదొడ్డి ప్రాంతంలోని హ్యుందాయ్ సర్వీస్ సెంటర్ వద్ద వర్షాకాలంలో నీటి నిల్వ కారణంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు స్ట్రాం వాటర్ డ్రెయిన్ లైన్ నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. ఐటీ కారిడార్ ప్రాంతంలో జనాభా, రహదారి విస్తరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మౌలిక వసతుల అభివృద్ధిని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని అన్నారు. ఈ నిర్మాణ పనుల పూర్తయిన తర్వాత గౌలిదొడ్డిలో నీటి నిల్వ సమస్య గణనీయంగా తగ్గి ప్రజలకు పెద్ద ఉపశమనం కలుగుతుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande