
తుళ్లూరు18 నవంబర్ (హి.స.), : రాజధాని ప్రాంతం వెంకటపాలెం సమీపంలో తితిదే నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయానికి మహర్దశ రానుంది. ఆలయానికి రెండో ప్రాకారం నిర్మించాలని తితిదే నిర్ణయించింది. ఈ నెల 27న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ పనులకు శంకుస్థాపన చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు ఉదయం 10.55 నుంచి 11.30 గంటల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. తిరుమల మాదిరిగా ఇక్కడ కూడా రెండో ప్రాకారం రూపుదిద్దుకోనుంది. పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కుల్లో 5 అంతస్తులతో గాలి గోపురాలు.. తూర్పు వైపున 7 అంతస్తులతో మహా రాజగోపురం నిర్మించనున్నారు. అంతర్భాగంలో మహా రాజగోపురానికి అభిముఖంగా ఆంజనేయ స్వామి ఆలయం, ఉత్సవ మండపం, కోనేరు మొదలైనవి రానున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ